6, ఏప్రిల్ 2010, మంగళవారం

నీ వీక్షణలే కదా...

గుండె గూటిలో వొదిగే గువ్వ పిట్ట..,

మనసు దోచిన రూపం నీలో చూసి మురిసే వొంటి పక్షి ...

విహారంలో జంటలు..,
విరహంలో మంటలు...

రెప్పలు మూయనివ్వని కవ్వింతలు..,
రేయి మత్తులో కలవరింతలు...

అన్నీ నీ వీక్షణలే కదా....

5, ఏప్రిల్ 2010, సోమవారం

మామా చందమామ...

మబ్బులతో దోబూచులాడుతున్న చందమామను చూస్తూ డాబా పైన పడుకోడం....
కొబ్బరాకు వంపులోంచి చంద్రుని చూడటం...
రెండు అపార్ట్ మెంట్ల మధ్యలోంచి తొంగిచూసే మామను పలకరించడం...
భూలోకంలో అందరూ బిజీ బిజీ..
నా ఊసులన్నీ నువ్వే వినాలి.....